రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమా ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ శ్రీలీల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం…”పెళ్లి సందడి’ విడుదల కాకముందే ‘ధమాకా’ కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను. ఇది చాలా మంచి ఎంటర్ టైనర్. చాలా హిలేరియస్‌గా ఉంటుంది. తక్కువ సమయంలోనే రవితేజ గారితో పని చేసే అవకాశం రావటం గ్రేట్ఫుల్ ఫీలింగ్. రవితేజ చాలా మోటివేట్ చేస్తారు. ‘విక్రమార్కుడు’లో ఆయన డ్యుయల్ రోల్‌ని ఎంత అవుట్ స్టాండింగ్‌గా చేశారో, ఇందులోనూ అంతే అద్భుతంగా చేశారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గత చిత్రాలు చూశా. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా ఉంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. ఇందులో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబుల్ రోల్‌తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా ఉంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం బాలకష్ణ, అనిల్ రావిపూడి సినిమా, అలాగే బోయపాటి-రామ్ సినిమా, వైష్ణవ్ తేజ్‌తో మరొక సినిమా, అలాగే వారాహి ప్రొడక్షన్లో ఒక సినిమా, నితిన్‌తో ఇంకొక సినిమా చేస్తున్నాను’ అని శ్రీలీల అన్నారు.