– వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ- సిటీ బ్యూరో
రాష్ట్రంలో జిల్లా, రాష్ట్ర మత్స్య సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఈ బడ్జెట్లో ప్రతి మత్స్య సొసైటీకి 10 లక్షల ఆర్థిక సాయం అందించే విధంగా నిధులు కేటాయించాలని మత్స్యకారుల సంఘం జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఈనెల 20న జరిగే మత్స్య సొసైటీ అధ్యక్షుల రాష్ట్ర సదస్సులో తీర్మానం చేయ బోతున్నట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ అఖిలభారత మత్స్యకా రులు,మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 20,21లలో జరుగుతున్న సందర్భంగా మొదటి రోజు రాష్ట్ర సదస్సు నిర్వ హించబోతున్నట్టు తెలిపారు. కేరళ మత్స్య ఫెడరేషన్ చైర్మెన్ వి.మనోహరన్, అఖిలభారత మత్స్యకారులు మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ అధ్యక్ష కార్య దర్శులు దేబ్ శషిబర్మన్, పీ.స్టాన్లీ, జాతీయ మత్స్యకార నాయకులు పాల్గొన బోతున్నారని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియోలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఎన్సీడీసీ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమ లుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మా ర్గం అన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఠా విజయ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కొప్పు పద్మ కరెల్లి లలిత, అర్వపల్లి శ్రీరాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముఠా దశరథ్, మామిళ్ల జగదీష్ పాల్గొన్నారు.