‘ఫుడ్‌ ఎలర్జీకి హౌమియోపతి వైద్యం ఉత్తమం’

– డాక్టర్‌ జి.గాయత్రి ప్రసాద్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ఫుడ్‌ ఎలర్జీ ద్వారా ఐసీయూ వరకు వెళ్ళిన పేషంట్లను హౌమియోపతి వైద్యం ద్వారా త్వరగా నయం చేయవచ్చునని ఎంఎన్‌ఆర్‌ హౌమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌ సంగారెడ్డి డిపార్ట్‌ మెంట్‌ఆఫ్‌ ఆర్గాన్‌, ఫిలాసఫీ డాక్టర్‌ జి.గాయత్రి ప్రసాద్‌ అన్నారు. తెలంగాణ హౌమియోపతిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌ నగర్‌లోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో వేణి భూషణ్‌ స్మారక ఉపన్యాసం, మెలనీ హానెమాన్‌ జన్మదిన వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. క్లినికల్‌ ప్రెజెంటేషన్‌ ఆన్‌ ‘ఒక మనిషి కలవడం మరొక మనిషికి విషం’, ‘ఫుడ్‌ అలర్జీ’, ‘హౌమియోపతిక్‌ మేనేజ్‌మెంట్‌-సాక్ష్యం-ఆధారిత అధ్యయనం’ అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుడ్‌ అలర్జీ వచ్చినపుడు శరీరంపై దుద్దర్లు ఏర్పడి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. దీనికి హౌమియో చికిత్స ఉత్తమమన్నారు. అనంతరం తెలంగాణ హౌమియోపతిక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కే.గోపాలకష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.దుర్గ ప్రసాద్‌, గౌరవ సలహాదారులు డాక్టర్‌ కూనపరెడ్డి శివశంకర్‌, కో-కన్వీనర్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ గౌరీల చేతుల మీదుగా హౌమియోపతి వైద్య తయారీదారులు, పంపిణీదారులను సన్మానించారు.

Spread the love