– రుతుప్రేమ చైతన్య ర్యాలిలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ
నవతెలంగాణ – చిన్నకోడూరు
మహిళలు అందరూ ప్లాస్టిక్ కప్స్ వాడకుండా బట్ట కప్స్ మాత్రమే వాడాలని జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో రుతుప్రేమ చైతన్య ర్యాలి చేపట్టి, రుతు ప్రేమపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మహిళలు ప్లాస్టిక్ కప్స్ వాడకుండా బట్ట కప్స్ మాత్రమే వాడాలని మహిళలచే ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లాలో రుతు ప్రేమ పైన మహిళకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలకు రుతుప్రేమ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నారాయణరావుపేట మండల వ్యాప్తంగా మహిళలకు రుతు ప్రేమ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని అన్నారు. ప్లాస్టిక్ కప్స్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తయని అన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం పైన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్య రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి, సర్పంచుల పోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు కవిత, విజయలక్ష్మి, చిన్నకోడూరు ఎంపీటీసీ1 శారదా రమేష్, మహిళలు పాల్గొన్నారు.