నవతెలంగాణ-ముషీరాబాద్
బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన పొలిటికల్ సెంటర్ ఆవిర్భావ సదస్సుకు దండి వెంకట్, కె.పర్వతాలు (తెలంగాణ,) పి.కోటేశ్వరరావు( ఏపీ) అధ్యక్షతన జరిగిన బహుజన శ్రామిక వర్గ ప్రణాళిక ముసాయిదాపై ప్రొఫెసర్ కాశీం ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలన్నీ ఆధిపత్య కులాల యాజమాన్యంలో రాజకీయ పార్టీలు కావడం మూలంగానే 85శాతం శాతం బహుజన ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కేవలం 15శాతం శాతం ఉన్న ఆధిపత్య కులాలకు చెందిన కొద్దిమంది పెట్టుబడిదార్ల దోపిడీ మూలంగా 85శాతం ఉన్న బహుజన ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కుల వ్యవస్థ నిర్మాణాన్ని ప్రభుత్వమే ప్రోత్సాహిస్తుందన్నారు. బహుజన పొలిటికల్ సెంటర్ రూపొందించిన బహుజన శ్రామిక వర్గ ప్రణాళిక సరళంగా ఉందని చెప్పారు. బహుజన శ్రామిక వర్గ ప్రణాళిక సిద్దాంత ముసాయిదాను కవి రచయిత జూపాక సుభద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహుజన శ్రామికవర్గ మహిళా విముక్తి కోసం ప్రత్యేక ఉద్యమాలు నిర్మించాలని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రీటైర్డ్ ఐఎఎస్ ఆకునూరి మురళి, భారత్ బచావో జాతీయ నాయకులు ఎం.ఎఫ్.డాక్టర్ గోపినాథ్, బహుజన పొలిటికల్ సెంటర్ మూడు రాష్ట్రాల నుంచి హాజరైన ముఖ్య నాయకులు ఎస్.సిద్దిరాములు, గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.