బాగుందని ప్రశంసిస్తున్నారు

సుధీర్‌ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘హంట్‌’. శ్రీకాంత్‌, ‘ప్రేమిస్తే’ ఫేమ్‌ భరత్‌ నివాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అప్రిసియేషన్‌ లభిస్తోంది.
ఈ సందర్భంగా సుధీర్‌ బాబు మాట్లాడుతూ, ‘ఈ సినిమా స్టార్ట్‌ చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని భయపడ్డాం. అయితే ప్రేక్షకులు అందరూ సెకండాఫ్‌లో 30 మినిట్స్‌ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో చాలా మంది సినిమాను అప్రిషియేట్‌ చేస్తూ పోస్టులు చేశారు. ఇది డిఫరెంట్‌ ఫిల్మ్‌’ అని తెలిపారు.
‘క్రిటిక్స్‌, ఆడియన్స్‌ నుంచి రెస్పాన్స్‌ చాలా బావుంది. డేరింగ్‌ అటెంప్ట్‌ అని ఆడియన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. సుధీర్‌ బాబు ధైర్యంగా ఆ రోల్‌ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా’ అని దర్శకుడు మహేష్‌ చెప్పారు.
భరత్‌ మాట్లాడుతూ, ‘తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రెయిట్‌ సినిమాతో రావడానికి కొన్నేళ్ళు టైమ్‌ తీసుకున్నా… మంచి సినిమా చేశా. సరైన సినిమా చేశా. కంటెంట్‌ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్‌ విలువలతో సినిమా తీశాం. దర్శకుడు మహేష్‌ కెరీర్‌లో ఇదొక మంచి సినిమా. సుధీర్‌ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్‌ సంస్థకు థ్యాంక్స్‌” అని అన్నారు.

Spread the love