బాలలు స్థిరమైన లక్ష్యాలు నిర్ధేశించుకోవాలి

– మోటివేషనల్‌ స్పీకర్‌, బాలల సంక్షేమ సమితి సభ్యులు కె.దామోదర్‌
నవ తెలంగాణ – కాటారం
బాలలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే స్థిరమైన లక్ష్యాలను నిర్దేశించుకో వాలని ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌, సైకాలజిస్ట్‌, బాలల సంక్షేమ సమితి సభ్యులు కె దామోదర్‌ అన్నారు. బుధవారం జయ శంకర్‌ భూపాల్లి జిల్లా కాటారంలోని ఆదర్శ హైస్కూల్‌లో చైర్మెన్‌ జనగామ కరుణాకర్‌రావు అధ్యక్షతన జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘బాలల సమస్యలు – సంబంధిత చట్టాలు, వ్యక్తిత్వ వికాసం’పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడా రు. బాలలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించా రు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతి క పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, చదువులో రాణించాలని తెలిపారు. విలువల తో కూడిన విద్యను అభ్యసించినప్పుడే జీవితం ఆనంద మయం అవుతుందని అన్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోయి విద్యార్థుల బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సూచించారు. బాలల సంరక్షణ అధికారి బాలల హక్కులు, సమస్యల పరిష్కారానికి సంబంధించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి ఏ. వెంకటస్వామి, సోషల్‌ వర్కర్‌ లింగారావు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్తిక్‌ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love