హైదరాబాద్ : జర్మన్ ఫుట్‌వేర్ బ్రాండ్ బిర్కెన్ స్టాక్ హైదరాబాద్‌లో రెండు కొత్త స్టోర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీంతో దక్షిణాదిలో తమ ఉనికిని మరింత పెంచుకున్నట్లయ్యిందని బిర్కెన్‌స్టాక్ ఇండియా తెలిపింది. నగరంలోని నెక్సస్ మాల్, శరత్ సిటీ మాల్‌లో కొత్త స్టోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్త విస్తరణలో భాగంగా జూబ్లిహిల్స్‌తో పాటు లులు మాల్, కొచ్చి, ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్, చెన్నరు, బెంగళూరులోని ఓరియన్ మాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.