బీఆర్‌ఎస్‌ పార్టీది అప్రజాస్వామిక పాలన..

 మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌. మల్లారెడ్డి.
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీది అప్రజాస్వామ్య పాలన అని బీజేపీి మెదక్‌ జిల్లా ఇన్చార్జి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ సింగిరెడ్డి మల్లారెడ్డి విమర్శించారు. ”మహా సంపర్క్‌ అభియాన్‌” లో భాగంగా ”గడపగడపకు బీజేపీ” కార్యక్రమం ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్‌ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్‌ డివిజన్‌ పరిధి లోని పలు ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని కొద్ది రోజుల్లో రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా అర్బన్‌ ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్‌ రెడ్డి, రంగారెడ్డి నగర్‌ డివిజన్‌ అధ్యక్షులు పరిష వేణు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు, గార్గే శివ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love