బీఆర్ఎస్ పార్టీ, రాము కుటుంబానికి అండగా ఉంటుంది

– మండల అధ్యక్షులు దండగుల మల్లయ్య
– మృతుని కుటుంబానికి సహాయం
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని ఇటీవలో మృతి చెందిన బీరెల్లి గ్రామానికి చెందిన మెంతని రాము కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్ లు, 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు. మెతన రాము కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ సర్పంచ్ గౌరమ్మ, తాడ్వాయి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, బీరెల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ వంగరి అనసూర్య సదానందం, కెక్కర్ల సాంబయ్య, దానక నర్సింగరావు, మధు, రోశయ్య శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love