– ధర రూ.45.90 లక్షలు
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు శనివారం భారత మార్కెట్లోకి కొత్త బిఎండబ్ల్యు ఎక్స్1 స్పోర్ట్స్ ఆక్టివిటీ వెహికల్ (ఎస్ఎవి)ని విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వర్షన్లలో ఇది లభ్యమవు తుందని ఆ కంపెనీ వెల్లడించింది. పెట్రోల్ వేరియంట్ ధరను రూ.45.90 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధరను రూ.47.90 లక్షలుగా నిర్ణయించింది. వీటిని బిఎండబ్ల్యు గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవ్హా ఆవిష్కరించారు. ఈ రెండు వాహనాలను కూడా చెన్నరు ప్లాంట్లో తయారు చేశామన్నారు.