బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

– పీఎల్‌జీఏ అగ్రనేత హిడ్మా మృతి- ధృవీకరించని పోలీసులు
నవతెలంగాణ-చర్ల
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పీఎల్‌జీఏ అగ్రనేత మడవి హిడ్మా బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు సరిహద్దులో ప్రచారం జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించిందని, అందులో హిడ్మా మృతి
చెందాడని అటు ఛత్తీస్‌గఢ్‌ ఇటు తెలంగాణ మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌ వేస్తున్నారు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ రాత్రి వరకు హిడ్మా మృతిని ధృవీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడని, పోలీసులకు లొంగిపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మావోయిస్టులు హిడ్మా బతికే ఉన్నట్టు ప్రకటన జారీ చేశారు. అంతేకాకుండా హిడ్మా లొంగి పోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వ సైకలాజికల్‌ వార్‌ చేస్తు న్నదని దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ అప్పట్లో ఓ ప్రకటన జారీ చేసి ంది. 43 ఏండ్ల హిడ్మా దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులను హతమార్చాడు. దక్షిణ బస్తర్‌ ప్రాంతంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం ఆదివాసీ తెగకుచెందిన వ్యక్తి హిడ్మా. 1996-97లో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరిన అతను శత్రువులను మట్టు పెట్టుడంలో దిట్ట.
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్‌ హిడ్మా’ :
తెలంగాణ – చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు అడవుల్లో పోలీసు బలగాలు ఇటీవల ”ఆపరేషన్‌ హిడ్మా” చేపట్టింది. బలగాలకు మావోయిస్టు మోస్ట్‌ వాంటెండ్‌గా మడవి హిడ్మా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఒకటో బెటాలి యన్‌ కమాండర్‌గా ఉన్నాడు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందేందు కు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి హిడ్మా వచ్చా రని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో బలగా లు అడవులను జల్లెడ పట్టాయి. మడవి హిడ్మా చదివింది 7వ తరగతి వరకే అయినా మావోయిస్టు అగ్రనేత గా అంచెలం చెలుగా ఎదిగారు. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేయడంతో అతను పోలీసుల హిట్‌ లిస్టులో ఉన్నాడు. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని ఉర్పల్‌ మెట్లలో 2007లో జరిగిన 24 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతి ఆ రోజుల్లో దేశమంతా సంచలనం సృష్టించింది. అదేవిధంగా తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది, 2017లో 12 మంది జవాన్లు మృతి ఘటనల్లో మావోయిస్టు మాస్టర్‌ మైండ్‌ హిడ్మా కీలకపాత్ర పోషించాడని తెలిసింది. మావోయిస్టు పార్టీలో మూడు విభాగాల్లో పనిచేసిన హిడ్మాపై ప్రభుత్వం రూ.45 లక్షల రివార్డు ప్రకటించింది.
హిడ్మాపై విష ప్రయోగం:
హిడ్మాపై స్లో పాయిజన్‌ ద్వారా విష ప్రయోగం జరిగిందన్న ప్రచారమూ జరిగింది. కాగా, అతను వైద్యం కోసం తెలంగాణకు వచ్చాడని కొన్ని వర్గాలు తెలిపాయి. ఆర్‌కే మృతికి కారణాలను ఆరా తీసేందుకు వచ్చాడని మరికొన్ని వర్గాలు అన్నాయి. పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్టు అప్పట్లో నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే పీఎల్‌జీఏ అగ్రనేత అయిన హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉంటుందని, అంటే కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి అంగ రక్షకులుగా ఉంటారని తెలుస్తోంది. ఏదేమైనాప్పటికీ హిడ్మా ఎన్‌కౌంటర్‌ను పోలీసులు బుధవారం రాత్రి వరకు ధృవీకరించలేదు.

Spread the love