బీజేపీలో తర్జనభర్జన

– తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై భేటీ
న్యూఢిల్లీ: 2023లో జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌ సభ ఎన్నికలకు బీజేపీ సన్నా హాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇది మంగళవారం కూడా కొనసాగుతుంది. సమావేశానికి ముందు ప్రధాని మోడీ పటేల్‌ చౌక్‌ నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌లోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్‌ సెంటర్‌ వరకు 15 నిమిషాల పాటు రోడ్‌షో చేశారు. అనంతరం నేరుగా కార్యవర్గ సమావేశానికి చేరుకుని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ భేటీ గురించి బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వివరించారు. బలహీనంగా ఉన్న బూత్‌లను ప్రధాని మోడీ గుర్తించారని, వాటిపై పటిష్టంగా పనిచేయాలని కోరారు. అలాంటి 72 వేల బూత్‌లను పార్టీ గుర్తించింది. ఇప్పటి వరకు పార్టీ 1 లక్షా 32 వేల బూత్‌లకు చేరుకున్నదని తెలిపారు.

Spread the love