బీజేపీలో విశ్వాసం కరువు!

–  త్రిపురలో డబుల్‌ ఇంజన్‌, అభివృద్ధి ఊసెేలేదు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారా? అని దేశమంతా ఎదురుచూస్తోంది. ఐదేండ్ల బీజేపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, ఇది ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు. వామపక్ష కార్యకర్తలు, నాయకులపై బీజేపీ ఆగడాలు, దాడులు ఎన్నికల్లో ప్రభావం చూపనుందా? అన్నది చెప్పలేని పరిస్థితి. అర్థబలం, అంగబలాన్ని నమ్ముకున్న బీజేపీ, డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం, అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.
న్యూఢిల్లీ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు 42.22శాతం, బీజేపీకి 43శాతం ఓట్లు దక్కాయి. స్వల్ప ఓట్ల తేడాతో అనేక స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.క్షేత్రస్థాయిలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావటం లేదని, అందువల్లే తమ నాయకుల్లో పెద్దగా విశ్వాసం కనపడటం లేదని బీజేపీ నాయకులే మీడియాకు చెబుతున్నారు. మరోవైపు వామపక్షాలు, కాంగ్రెస్‌ సంయుక్తంగా చేపడుతున్న ఎన్నికల ర్యాలీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఏఐసీసీ త్రిపుర ఇన్‌ఛార్జ్‌ అజరు కుమార్‌ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ఇరు పార్టీల సీఎం అభ్యర్థి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేందర్‌ చౌదరీ అని ప్రకటించటంతో చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది.
అయితే కాంగ్రెస్‌ ఓట్లు వామపక్ష అభ్యర్థులకు పడతాయన్న గ్యారెంటీ లేదు. 2018లో ప్రజలు మార్పును కోరుకున్నారు. నేడు అదే స్థాయిలో మార్పును ఓటర్లు కోరుకుంటున్నట్టు చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి..ప్రతిపక్షాలకు ఓట్లుగా బదిలీ అవుతాయనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
డబుల్‌ ఇంజన్‌ ఏది? ఎక్కడీ
అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరిగినా..అక్కడికి వెళ్లి ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రచారాన్ని బీజేపీ మొదలుపెడుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే అభివృద్ధే..అభివృద్ధి..అంటూ బీజేపీ నాయకులు ఊదరగొట్టడం ఆనవాయితీ. అయితే…ఈ ఎన్నికల్లో ‘డబుల్‌ ఇంజన్‌’ స్లోగన్స్‌ బీజేపీ ఇవ్వటం లేదు. పాలన, సంక్షేమం గురించి మాట్లాడటం లేదు. ఎన్నికల్లో గెలిచేవరకే ఆ మాటలు..అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. సీఎంగా విప్లవ్‌ దేవ్‌ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని అతడ్ని పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో సీఎంగా మాణిక్‌ సాహాను మే 2022లో బీజేపీ తీసుకొచ్చింది. ఆయన పనితీరుపై ప్రజలెవ్వరూ సంతృప్తిగా లేరు. ‘2018లో ఓటేశాం..ఏ లాభం. ఈ ప్రభుత్వం ఏం చేసింది?’ అనే ప్రశ్న ప్రతిచోటా బీజేపీకి ఎదురవుతోంది. పాలన, సంక్షేమం పక్కకు పెట్టి..వామపక్ష కార్యకర్తలపై దాడులు చేయటమే లక్ష్యంగా

Spread the love