బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు

– త్రిపురలో సొంత పార్టీ నేతల ఆందోళన
ఇంటర్నెట్‌ : త్రిపురలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థులు దొంగలు, గూండాలు, వివిధ కుంభకోణాలకు పాల్పడుతున్నా రని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. పార్టీ కార్యాలయాల వద్ద బీజేపీ హఠావో – త్రిపుర బచావో అంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయాల వద్ద జెండాలను తొలగించి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకుగాను అభ్యర్థులను ప్రకటించినప్పటి నుండి బీజేపీ నియోజకవర్గ కార్యాలయాల్లో పార్టీ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. పలు చోట్ల పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. మరోవైపు లెఫ్ట్‌ పార్టీల అభ్యర్ధులను గెలిపించుకోవాలని త్రిపుర ప్రజలు భారీగా వారి వెంట ర్యాలీ అవుతున్నారు.

Spread the love