బోనమెత్తిన గవర్నర్‌ తమిళిసై

– వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు
– హాజరైన హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ-పటాన్‌చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో శుక్రవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో తెలంగాణ, హర్యాన గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం పటాన్‌చెరులోని మహంకాళి ఆలయం నుంచి 72 బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ఎల్లమ్మతల్లికి సమర్పించారు. గవర్నర్‌ తమిళిసై బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు సంధ్యా నందీశ్వర్‌ గౌడు రూ.25 లక్షలతో చేయించిన ఆభరణాలు అమ్మవారికి తొడిగించారు. గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Spread the love