బోరుబావిలో పడిన 8 ఏండ్ల కుర్రాడు…


భోపాల్‌:
మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా మాండవీలో ఎనిమిదేండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని క్షేమంగా వెలికితీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మాండవికి చెందిన నానక్‌ చౌహాన్‌ అనే రైతు తన పొలంతో రెండేండ్ల క్రితం బోరు వేశాడు. అయితే అందులో నీళ్లు అడుగంటిపోవడంతో ప్రస్తుతం అది నిరుపయోగంగా ఉన్నది. దీంతో బోరుబావిని కప్పి ఉంచానని, అందులో అతడు ఎలా పడిపోయాడో తనకు అర్ధమవడం లేదని అతడు పోలీసులకు తెలిపాడు. కాగా, బాలుడు ఎంత లోతులో ఉన్నాడని విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అయితే అతడికి ఆక్సిజన్‌ అందేలా ఏర్పాటు చేశామన్నారు. బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని బయటకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Spread the love