బ్రిడ్జి ప్రారంభోత్సవంలో వివాదం..

– మల్లాపూర్, లోలం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత
– గ్రామంలో ప్రారంభోత్సవాలు చేయకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం కోసం ఇరు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేలు, మంత్రులకు మొరపెట్టుకున్న బ్రిడ్జి నిర్మాణం శలఫలకాలకే పరిమితమైంది. మొట్టమొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రారంభోత్సవాలకు అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బ్రిడ్జి నిర్మాణానికి మల్లాపూర్ లోలం గ్రామాలకు తీసుకొని వచ్చి బ్రిడ్జి అవశ్యకతను చూయించారు. ఇరువురు కలిసి శంకుస్థాపన చేయకుండానే బ్రిడ్జి నిర్మాణానికి నాలుగున్నర కోట్ల నిధులను కేటాయించారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి దాదాపు 4,5 ఏళ్ల సమయం దాటింది. ఇరు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పలుమార్లు ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి బ్రిడ్జి ప్రారంభోత్సవం చేపట్టాలని విన్నవించారు. ఎట్టకేలకు ఆదివారం మల్లాపూర్ లోలం గ్రామాలలో వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, గ్రామపంచాయతీ భవనం, సిసి రహదారులు, వైకుంఠధామాలు, రైతు వేదిక, మహిళా సంఘ భవనాలు, కమ్యూనిటీ భవనాల ప్రారంభోత్సవానికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని మల్లాపూర్ గ్రామంలో ప్రారంభోత్సవాలు చేసుకుని లోలం లో ప్రారంభోత్సవాలు చేపట్టాల్సి ఉండగా శనివారం రాత్రి నుండే ఇరు గ్రామాలలో శీలఫలకం విషయమై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకొని వెళ్లగా ఇరు గ్రామాల సరిహద్దుల్లో ఉన్నా ఈ బ్రిడ్జి మధ్యలో సీలఫలకం వేసుకోవాలని ఎమ్మెల్యే వారికి సూచించినట్లు పలువురు తెలిపారు. లోలం గ్రామస్తులు మల్లాపూర్ సరిహద్దు వైపున శీలపలకం పెట్టారు. ఎమ్మెల్యే మల్లాపూర్ గ్రామంలో అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఇక్కడి నుండే లోలంకు వస్తు బ్రిడ్జి వద్ద ఉన్న శిలఫలకాన్ని ఆవిష్కరిస్తారని లోలం గ్రామస్తులు ఆడ,మగా తేడా లేకుండా డప్పు వైద్యాలతో బ్రిడ్జి వద్దనే స్వాగతం పలికడానికి వేచి ఉన్నారు. అంతకు ముందు మల్లాపూర్ గ్రామస్తులు బ్రిడ్జి విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. ఇరు గ్రామాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించి బ్రిడ్జిని సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రారంభోత్సవం చేయవద్దని ఒక ఆలోచనతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మల్లాపూర్ నుండి సరిహద్దు గుండా కాకుండానే ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి, ఎల్లారెడ్డిపల్లి మీదుగా తిరిగి లోలం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు వచ్చి గంటసేపు వేచి ఉన్నారు.
కాని ఎం ఒక్కరు కూడా గ్రామంలో ఉండకుండా గ్రామం అంత బ్రిడ్జి వద్దనే ఉండి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తేనే గ్రామంలోకి వస్తావని పట్టు పట్టి అక్కడే బైఠాయించ కూర్చున్నారు. అంతలోనే మల్లాపూర్ గ్రామస్తులు కొందరు బ్రిడ్జి వైపు రాగా అది గమనించిన లోలం గ్రామస్తులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తులను చెల్లాచెదురుగా చేసి మల్లాపూర్ గ్రామస్తులను తిరిగి పంపించారు.కోందరి చేతుల్లో
కట్టెలు రాళ్లతో ఇరు గ్రామాల మధ్య తీవ్ర గర్షణ వాతావరణం నెలకొనడంతో ఎస్సై నరేష్ కుమార్ సిబ్బందితో పాహర కాసారు. పెద్ద ఎత్తున గొడవ కాకుండా చూశారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శిలాఫలకం ప్రారంభించకపోవడంతో లోలం గ్రామస్తులు వాగు పైన భారీ ఎత్తున మహిళలు గ్రామస్తులతో కలిసి బైఠాయించారు. మల్లాపూర్ గ్రామానికి ఎలాంటి సంబంధం లేదని, అధికారులు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారమే తమ శిలాఫలకం పై పేర్లు రాయించామని అది ముమ్మటికి తమ గ్రామ శివారులోనే ఉండటంతో శిల పలాకాన్ని పెట్టుకున్నామని లోలం గ్రామస్తులు వివరించారు.
మల్లాపూర్ గ్రామస్తులు మా గ్రామానికి సరిహద్దుగా ఉన్న చోట పెట్టకుండా లోలం గ్రామ సరిహద్దు వైపు పెట్టుకోవాలని వారు వివరిస్తున్నారు.కాని కావాలని మల్లాపూర్ గ్రామస్తులు ఉద్రిక్తత సృష్టిస్తున్నారని లోలం గ్రామస్తులు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో వారం నుండి అన్ని సిద్ధం చేసిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు చేయకుండానే లోలం గ్రామస్తులు చేసిన వంటలు కూడా అలాగే ఉండిపోయాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు నుండి వెళ్లిపోవడంతో చేసేదేమీ లేక గ్రామస్తులు వేనుదిరిగారు. ఎప్పుడు ఇలాంటి సంఘటన ముంచుకొస్తుందోనని ఇరు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజువారీగా రాకపోకలు సాగించేవారు ఎప్పుడు ఏమవుతుందోనని భయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన అభివృద్ధి పనులు ప్రారంభించకుండానే వెను తిరగడంతో ప్రజాప్రతినిధులు గ్రామస్తుల ముందు ఏమి చెప్పలేక మిన్నకుండిపోయారు. దీనిలో ఒక గ్రామానికి చెందిన వారు తమపై సీసాలతో కర్రలతో దాడి చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్కు వివరించారు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆస్పత్రికి పంపించడం జరుగుతుందని వారికి ఎస్సై వివరించారు. ఏది ఏమైనా ఎన్నో ఏండ్ల కళ సఫలమౌతున్న వేళ గొడవ తివ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ప్రారంభోత్సవం చేయకుండానే వెను తిరగడంతో పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Spread the love