నవతెలంగాణ – కూకట్‌పల్లి
కూకట్‌పల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షులు వి.ఎస్.ఎస్.సి.ఎస్.శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యా యులు సి.నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ క్యాలెండర్ 2023ని ఆవిష్కరించారు. ప్రస్తుతం భాషా పండితుల పదోన్నతుల సమస్య పరిష్కారం కొరకు సహకరించాలని ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డిని కోరగా, ఆయన స్పందిస్తూ 20 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ అపరిష్కతంగా ఉన్న సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలని ఆకాంక్షిస్తూ తమ సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వి.ఎస్.ఎస్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం పదోన్నతుల బదిలీల షెడ్యూల్ విడుదల ప్రక్రియ కొనసాగుతుండగా, అందులో భాషా పండితుల పదోన్నతులు కోర్టు కేసు ఉందన్న కారణంగా పక్కకు పెట్టిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, పై అధికారులు భాషా పండితులకు కేసు పై ఉన్న స్టేని ఎత్తివేసినట్లయితే ఈ షెడ్యూల్లో భాషా పండితుల పదోన్నతులు చేసే అవకాశం ఉందని రాష్ట్ర సంచాలకులు శ్రీదేవసేన తెలియజేశారని, అదేవిధంగా స్టే వేకెట్ చేయుటకు ప్రభుత్వ పక్షాన మరియు సంఘ తరఫున పిటిషన్ వేయటం జరిగిందనిచ, మరోపక్క గత నెలలో వేణుగోపాల్ భాషా పండితుల పదోన్నతులపై ఉన్న కేసులను ఒకే బెంచిపైకి తీసుకురావాలని, తద్వారా త్వరగా వాదనలు జరిపి త్వరగా తీర్పు రావడానిక సులభంగా ఉంటుందని ఆదేశించిన నేపథ్యంలో, రకరకాల బెంచీలపై ఉన్న కేసులను ఒకే బెంచ్ పైకి తెచ్చే సంఘం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ ప్రక్రియకి వారం రోజులు సమయం పట్టవచ్చు అని అడ్వకేట్ తెలియజేశారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఅర్ గత 2017 ప్రపంచ తెలుగు మహాసభలలో భాషా పండితులకు అనేకమైన సమస్యలు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం హామీ మేరకు త్వరితగతిన భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి బి.స్వప్న, సీనియర్ భాషా పండితులు చంద్రశేఖర్, జిల్లా సహాధ్యక్షులు కష్ణ గౌడ్, జిల్లా సలహాదారులు మాణిక్యం, జిల్లా కార్యదర్శులు సాయి గీతిక, పాఠశాల ఉపాధ్యాయులు నజీముద్దీన్ మల్లారెడ్డి సురేష్, పి.నర్సింహులు, గాయత్రి, మంజుల, రాణి, గీతాభవాని, డార్కస్ మేడం, శాంతి స్వరూపిణి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.