మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు

–  తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో141 మున్సిపాల్టీల్లో రూ:282 కోట్లతో ఆధునిక ధోబిఘాట్లు నిర్మించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసినందుకు పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావుకు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో దానికి రూ.2 కోట్లతో రూ.282 కోట్లతో ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతించారు. రజక వృత్తిదారుల సంఘం ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించి అన్ని జిల్లాలు, మున్సిపాల్టీ, మండల కేంద్రాల్లో మెకనైజ్‌ లాండ్రీ (ధోబిఘాట్లు) నిర్మించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించిందని గుర్తుచేశారు.

Spread the love