నవతెలంగాణ – ఢీల్లి
కేంద్ర బడ్జెట్ 2023 తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు మొదలైన ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా కీలక శాఖలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు సమీక్షిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాదిలో కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. కేంద్ర బడ్జెట్ 2023-24ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే. అయితే, కేబినెట్ పునఃవ్యవస్థీకరణపై వార్తలు వచ్చిన క్రమంతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధాని నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.