మందుబాబుల వీరంగం.. ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి..!


హైదరాబాద్‌:
రాజధాని హైదరాబాద్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హిమాయత్‌నగర్‌లో విధుల్లో ఉన్న ఓ ఎస్‌ఐని తమ కారుతో ఢీకొట్టారు. దీంతో అతని కాలు విరిగిపోయింది. ఎస్‌ఐ నరేశ్‌ విధుల్లో భాగంగా శనివారం రాత్రి తన సిబ్బందితో కలిసి హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ కారును ఆపడానికి ప్రయత్నించాడు. అది గమనించిన మందుబాబులు కారును ఆపకుండా ఎస్ఐని ఢీకొట్టారు. దీంతో నరేశ్‌ కుడికాలు విరిగిపోయింది. సహచరులు వెంటనే ఆయనను నాంపల్లి కేర్‌ దవాఖానకు తరలించారు. మందుబాబులను రాంనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌, యశ్వంత్‌గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Spread the love