మల్లాపూర్ లో సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభం

– గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి సర్పంచ్ ధర్మవ్వ
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఐదు లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం పనులను ఆ గ్రామ సర్పంచ్ ధర్మవ్వ గ్రామ కార్యదర్శి పద్మావతి గ్రామ ప్రజలు కలిసి మంగళవారం నాడు సిసి రోడ్ల పండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈజీఎస్ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన మల్లాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న సర్పంచ్ ధర్మవ కు గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం మురికి కాలువల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి జరుగుతుందని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు.

Spread the love