మహిళల సాధికారతే లక్ష్యంగా ఉచిత కుట్టు శిక్షణ

-రాష్ట్రంలో మొట్ట మొదటగా రూ.5కోట్ల10లక్షలతో పాలకుర్తి
– నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
నవతెలంగాణ-తొర్రూరు
మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో రూ.5వేల10లక్షలతో 3 వేల మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆది వారం తొర్రూరు మున్సిపాలిటీ, పెద్ద వంగర మండలాల మహిళలకు కుట్టు మిషన్‌ శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. మహి ళలు, శిక్షణ ఇస్తున్న శిక్షకులు, నిర్వహిస్తున్న అధికారులతో మంత్రి మాట్లాడి శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనం తరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ వచ్చాక మహిళలకు ప్రాధా న్యత పెరిగిందన్నారు. తాను ఎమ్మెల్యే అ యినప్పుడు తన నియోజక వర్గంలో, రాష్ట్రంలో మహిళలు కుండలు పట్టుకుని నీళ్ళ కోసం నిలబడే వారని, నీళ్లకు బోరింగ్‌ వేస్తే చాలు అనేవారన్నారు. ఎమ్మెల్యే నిధులు అన్ని బోరింగ్‌లకే సరిపోయేద న్నారు. కానీ, కేసిఆర్‌ రూ.40వేల కోట్లతో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు ఇస్తున్నారన్నారు. తె లంగాణ రాక ముందు మహిళలకు రూ. 4వేల కోట్ల రుణాలు వచ్చేవని, ప్రస్తుతం రూ.18వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని చెప్పారు. గ్రామంలో ప్రతి వస్తువు మనమే తయారు చేయాలని, మధ్య దళారులుగా బతికే బదులు మనమే బ్రాండ్‌ తయారు చేసుకోవాలని అన్నారు. స్త్రీ నిధి కింద మహిళలు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇస్తు న్నామని చెప్పారు. అభయ హస్తం కింద డబ్బులు కట్టిన వారికి మిత్తితో కలిపి వాపస్‌ ఇస్తున్నామన్నారు. డబ్బులు కట్టిన వారికి 2వేల పెన్షన్‌ కూడా ఇస్తామని, హా స్టళ్ళలో బట్టలు కుట్టే పని వేరే వారికి ఇస్తున్నాం, మన మహిళలకు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. సంగెం మం డలంలో టెక్స్‌ టైల్‌ పార్క్‌ కు 10 వేల మంది అవసరం, కొడకండ్లలో కూడా మినీ టెక్స్‌ టైల్‌ పార్క్‌ వస్తుందని, వీటి వల్ల మహిళలకు ఉపాధి, ఉద్యోగం లభిస్తుంద న్నారు. కుట్టు మిషన్ల శిక్షణ కోసం సెర్ఫ్‌ నుంచి రూ.10వేలు, స్త్రీ నిధి నుంచి రూ.7 వేల చొప్పున ఒక్కొకరిపై రూ.17వేలు మొత్తం రూ.5కోట్ల10 లక్షలు ఖర్చు చేస్తు న్నామన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తం గా అమలు చేస్తామని చెప్పారు. మహిళలు వ్యాపార వేత్తలు కావాలని, వ్యాపారం చేయడానికి ముందుకు వస్తే హైదరాబాద్‌ లో శిక్షణ ఇప్పిస్తామనాన్రు. అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వారితో ఒప్పందం పెట్టుకున్నామన్నా రు. ప్రతి గ్రామంలో సమాఖ్య భవనాలు కట్టిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శశాంక, స్థానిక ప్రజాప్రతి నిధులు, నాయకులు, అధికారులు, భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Spread the love