మార్కెట్లకు తొలి సెషన్‌లో లాభాలు

ముంయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది తొలి సెషన్‌లో లాభాలు సాధించాయి. కొనుగోళ్ళ మద్దతుతో సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 327 పాయింట్లు పెరిగి 61,168కి చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 18,197 వద్ద ముగిసింది. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.8 శాతం, 0.6 శాతం చొప్పున రాణించాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా పుంజుకొని ఇంట్రాడేలో గరిష్ఠాలకు చేరుకొన్నాయి. లోహ, మౌలిక రంగాల షేర్లు అధికంగా లాభపడ్డాయి.

Spread the love