మినీ మేడారం జాతరకు పట్టిష్టమైన భద్రత

– ములుగు ఎస్పి గౌస్ ఆలం
– పరిసరాల పరిశీలన
– వనదేవతలను దర్శించుకున్న పోలీస్ బాస్ లు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మినీ మేడారం జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ములుగు ఎస్పి గౌస్ ఆలం అన్నారు. ఆదివారం ములుగు ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఏటూర్ నాగారం ఏఎస్పి సిరిశెట్టి సంకీర్త్, స్థానిక పోలీసులతో కలిసి మేడారంలోని సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలను దర్శించుకున్నారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. భద్రత పరమైన ఏర్పాట్లను అనంతరం మేడారంలోని పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం మినీ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీస్ అధికారులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దొంగతనాలు జరగకుండా, మినీ జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మినీ జాతరకు వచ్చు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం చేరుకొని మనదేవతలను దర్శించుకుని ప్రశాంతంగా ఎవరి ఇండ్లల్ల కు వారు వెళ్ళొచ్చని తెలిపారు. మేడారంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. క్యూలైన్లు మేడారం గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, రెడ్డిగూడెం, జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసర సీఐ వంగ శంకర్, పసర ఎస్సై కరుణాకర్ రావు, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు, సిఆర్పిఎఫ్, సివిల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love