మినీ మేడారం జాతరలో… ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

– డీఎంహెచ్‌ఓ అప్పయ్య,
– పూజారుల సంఘం
– అధ్యక్షుడు జగ్గారావు
నవతెలంగాణ-తాడ్వాయి
మినీ మేడారం జాతరకు తర లివచ్చే లక్షలాదిమంది సందర్శకులకు నిరంతర వైద్య సేవలు అందించడా నికి మేడారంలో టీటీడీ కల్యాణ మం డపంలో ఉచిత వైద్య శిబిరాన్ని ములు గు డీఎంహెచ్‌ఓ అల్లం అప్పయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబో యిన జగ్గారావు ఆదివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. మినీ జాతర సందర్భంగా నేటి నుండి ఫిబ్రవరి 5వరకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అన్నారు. జనవరి 31 నుండి ఓపీ సేవలు ఉంటాయన్నారు. మినీ జాతర ఫిబ్రవరి 1 నుండి 5వరకు మాత్రం 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుం దని అన్నారు. రూ.10లక్షల విలువ చేసే మందులు (ఔషధాలు), 50వేల మాస్కులు అందుబాటులో ఉన్నాయ న్నారు. మినీ జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య శిబిరానికి చేరుకొని ఉచిత వైద్యం పొందాలని సూచిం చారు. మినీ జాతరలో భక్తులు హౌ టల్లోని, బయట రోడ్డుపై దొరికే ఆహా ర పదార్థాలను తినకూడదన్నారు. మాస్క్‌లు ధరించి, కరోనా నిబంధన లు పాటించాలన్నారు ములుగు జిల్లా లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లలో వైద్యులు, సిబ్బంది అందుబాటు లో ఉండి వైద్య సేవలు అందిస్తార న్నారు. ఐలాపూర్‌, కొండాయి, కన్నేప ల్లి, దొడ్ల, మల్యాల పిల్ల జాతరలలో కూడా ఉచిత వైద్య శిబిరాలను ప్రారం భించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనదేవతల ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సిద్ధబోయిన సురేందర్‌, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రణధీర్‌, డిపిఎమ్‌ఓ సంజీవరావు, హెచ్‌ వి లు సరస్వతి, లక్ష్మి, సూపర్వైజర్‌ ఖలీల్‌, ఏఎన్‌ఎంలు సునీత, మమత, రాజ్యలక్ష్మి, హెల్త్‌ అసిస్టెంట్లు చేల తిరుపతయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love