మిషన్‌ కాకతీయ అధ్యయనానికి పంజాబ్‌ బృందం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ ఈనెల 16న మాన్‌ కొండపవచ్చమ్మ సాగర్‌, సిద్దిపేట జిల్లాలో మిషన్‌ కాకతీయ చెరువులు, చెక్‌ డ్యాంలను సందర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం పంజాబ్‌ తిరిగి వెళ్ళిన తర్వాత పంజాబ్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయ అధికారులను పిలచి తెలంగాణలో మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని , దాని వలన రాష్ట్రంలో భూగర్భ జలాల అభివద్ది ఎట్లా జరిగిందో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆమేరకు ముగ్గురు సభ్యుల బందం ఈ నెల 28న రాష్ట్రానికి రానుంది. వారంతా మార్చి ఒకటి, రెండు తేదీల్లో తెలంగాణలో మిషన్‌ కాకతీయ చెరువులు, చెక్‌ డ్యాంలు, భూగర్భ జలాల రీచార్జింగ్‌ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సాగునీటి శాఖ, భూగర్భ జల శాఖ వారి అధ్యయనానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి చూపించాల్సిన చెరువులు, చెక్‌ డ్యాంలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సోమవారం నాటికి రెండు లేదా మూడు జిల్లాల్లో పర్యటన షెడ్యూల్‌ ఖరారు అవుతుందని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. మురళీధర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయమని గజ్వేల్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ హరిరాం, భూగర్భ జల శాఖ సంచాలకుడు పండిత్‌ మధూరేను ఆదేశించినట్టు చెప్పారు.

Spread the love