హైదరాబాద్ : బెంగళూర్‌లో మిశ్రమ ఫలితాలు చవిచూసిన అహ్మదాబాద్ డిఫెం డర్స్.. హైదరాబాద్‌లో అదిరే విజయం సాధిం చింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్‌లో శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడి యంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ముంబయి మెటియర్స్‌పై అహ్మదాబాద్ డిఫెండర్స్ 4-1తో ఘన విజయం సాధించింది. 14-15, 15-12, 15-14, 15-13, 15-14తో అహ్మదాబాద్ డిఫెండర్స్ గెలుపొందింది. అహ్మదాబాద్‌కు ఇది రెండో విజయం కాగా, ముంబయికి మూడో ఓటమి. అహ్మదాబాద్ తరఫున నందగోపాల్, రామస్వామి సూపర్ స్పైక్‌లతో అదరగొట్టారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో నేడు హైదరాబాద్ బ్లాక్‌హాక్స్‌తో చెన్నై బ్లిట్జ్ తలపడనుంది.