ముగిసిన సినీ నటి జమున అంత్యక్రియలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : అలనాటి సినీ తార జమున అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. జమునకు కూతురు స్రవంతి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జమునకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలివచ్చారు. అంతకుముందు జమున భౌతికకాయాన్ని ఆమె నివాసం నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌కు తరలించారు. ఫిలించాంబర్‌లో ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు జమున పార్థీవదేహానికి నివాళులర్పించారు. తెలుగింటి సత్యభామగా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున గత కొంతకాలంగా వయో సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

Spread the love