నవతెలంగాణ-సిటీబ్యూరో
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్క రించుకుని శుక్రవారం టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, వల్లబ్ నగర్ సబ్ రిజిస్టర్ డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో వల్లబ్ నగర్ కార్యాల యంలో ముఖ్యఅతిథి బోయిన్పల్లి కార్పొరేటర్ ఎం.నర్సింగ్ యాదవ్ సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం డాక్టర్ ముజీబ్ మీడి యాతో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని కృషి చేసిన కార్యసాధకుడు కేసీఆర్ అని అన్నారు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, బంగారు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా మరింత ముందుకుసాగాలని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.