ముషీరాబాద్‌ తహశీల్దార్‌తో కార్పొరేటర్‌ హేమ భేటీ

నవతెలంగాణ-ఓయూ
ముషీరాబాద్‌ తహసీల్దార్‌ అయ్యప్పతో సీతాఫల్‌మండి కార్పొరేటర్‌ సామల హేమ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారసిగూడలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ఖాళీ స్థలంలో యూపీహెచ్‌సీ నిర్మించాలనే ఆలోచన ఉందనీ, తమకు ప్రభుత్వ నిబంధనలతో భూమిని అందజేయాలని తహశీల్దార్‌ని కోరారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌ మంజూరు అయ్యేలా కృషి చేయాలని కోరారు. కొంత మంది పాత పెన్షన్‌ లబ్దిదారులకు గుర్తింపు కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను ముషీరాబాద్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. కొత్త పెన్షన్‌ లబ్దిదారులకు పెన్షన్‌ పడని వారు కేవైసీ ఫాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంటుందనీ, దాన్ని బ్యాంకులో ఇవ్వాలని కోరారు.

Spread the love