మూడు తరాల సంఘర్షణ

సాత్విక్‌ వర్మ, జాక్‌ రాబిన్‌సన్‌, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్‌ నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘చిక్లెట్స్‌’. శ్రీనివాసన్‌ గురు సమర్పణలో యస్‌ యస్‌ బి ఫిల్మ్స్‌ పతాకంపై ముత్తు ఎం ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో రామ్‌ కార్తీక్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ముత్తు.ఎం మాట్లాడుతూ, ’90 జనరేషన్‌, 2 కె జనరేషన్‌ పిల్లలకు, పేరెంట్స్‌కు మధ్య జరుగుతున్నటు వంటి సంఘర్షణని ఈ సినిమాలో చెప్పాం. లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, పేరెంట్స్‌ ఎమోషన్‌ ఇలా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఈ సినిమా. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతకు ఈ సినిమా బిగ్‌ హిట్‌ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘పేరెంట్స్‌, కిడ్స్‌ మధ్య ఉన్న అన్ని ఎమోషన్స్‌ కలిపి ఈ సినిమాను అందరూ వెళ్లి చూడచ్చు. ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని నిర్మాత శ్రీనివాసన్‌ గురు అన్నారు. లైన్‌ ప్రొడ్యూసర్‌ డానియల్‌ మాట్లాడుతూ, ‘ఇది 90 కిడ్స్‌ కోసం తీసిన సినిమాకు కాదు. 2 కె కిడ్స్‌ కోసం తీసిన ఈ సినిమాలో మంచి మెసేజ్‌ ఉంటుంది. చూసిన వారందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పారు. నాయికలు మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్‌ మాట్లాడుతూ, ‘ఇందులో మాకు మంచి పాత్రలు ఇచ్చారు. మనకు పేరెంట్స్‌ ఎంత సపోర్ట్‌ చేస్తున్నారో అంతే ఫ్రీడమ్‌ కూడా ఇస్తున్నారు. అయితే వారిచ్చిన ఫ్రీడమ్‌ను మిస్‌ యూజ్‌ చేసుకోకండి అని చెప్పే సినిమా ఇది’ అని అన్నారు. హీరో సాత్విక్‌ మాట్లాడుతూ,’పిల్లలు ఫ్రీడమ్‌ను ఎలా మిస్‌ యూజ్‌ చేసుకుంటున్నారు అనేది బాగా నచ్చి ఈ సినిమా చేశాను. యూత్‌ అందరికీ నచ్చే మంచి కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది’ అని చెప్పారు.

Spread the love