మూడో టెస్టు.. 197 స్కోరుకే ఆసీస్ ఆలౌట్

నవతెలంగాణ – హైదరాబాద్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రెండో రోజు భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో మూడు వికెట్లతో కంగారూలకు అడ్డు కట్ట వేసి భారత్ ను రేసులోకి తెచ్చారు.
ఓ దశలో 186/4తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్ ఈ ఇద్దరి దెబ్బకు 11 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. దాంతో, ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌటైంది.  దాంతో, ఆసీస్ కు 88 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్ నైట్ స్కోరు 156/4తో ఆట కొనసాగించిన ఆసీస్ కు రెండో రోజు ఉదయం ఓవర్ నైట్ బ్యాటర్లు పీటర్ హ్యాండ్స్ కోంబ్ (19), కామెరూన్ గ్రీన్ (21) మంచి ఆరంభమే ఇచ్చారు.

Spread the love