మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి

హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి ఎస్‌ఎఫ్‌ఐ విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థులకు రాయితీతో కూడిన మెట్రో రైల్‌ పాస్‌లు ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) కోరింది. ఈ మేరకు బుధవారం రసూల్‌పూరాలోని మెట్రో రైల్‌ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని కలిసి హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్‌ గువేరా, అశోక్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వీరేందర్‌, శివ, వాసు వినతి పత్రం అందజే శారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరా బాద్‌ మెట్రో రైల్‌ అతికొద్ది కాలంలోనే ప్రజలకు మంచి రవాణా సౌకర్యాన్ని అందిస్తూ ప్రజాధరణ పొందింద న్నారు. అదే సమయంలో నగరంలోని లక్షలాది మంది విద్యార్థులకు మెట్రో రైలు ప్రయాణాన్ని మరింత అందుబాటులో తెచ్చేం దుకు రాయితీతో కూడిన మెట్రోరైల్‌ పాస్‌లు జారీ చేయాలని కోరుతున్నామన్నారు. ఈ పాసుల జారీ చేయడం ద్వారా పేద, మధ్యతర గతి విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సంస్థ తమ సామాజిక బాధ్యతగా పాసుల జారీని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులలో బస్సు పాసుల కారణంగా పేద విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని, అదే మాదిరిగా మెట్రో రైల్‌ సంస్థ సైతం పాసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Spread the love