మేడారంలో కిక్కిరిసిన జనం

– వనదేవతలను దర్శించుకున్న ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లలితా శివజ్యోతి
– వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మేడారం పరిసరాలు కిక్కిరిసి, జన సముద్రంలో మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక తరలివచ్చారు.‌ జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలను సమర్పించి గద్దెల వద్దకు చేరుకొని, సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు.
వనదేవతలను దర్శించుకున్న ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివిపి లలితా శివజ్యోతి
మేడారంలోని సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలను ఆదివారం ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ములుగు చైర్మన్ పివిపి లలితా శివజ్యోతి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. వీరికి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో ఎండోమెంట్ సిబ్బంది డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే  సమర్పించి ప్రత్యేక ముక్కలు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి, అమ్మవారి ప్రసాదం సమర్పించి వారికి ఘనంగా సన్మానించారు. వీరికి స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు తన పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వనదేవతలను దర్శించుకున్న జేఏసీ నాయకులు, ప్రముఖులు
వనదేవతల దర్శనానికి ఆదివారం ములుగు ఉద్యోగ జేఏసీ నాయకులు కోరం నర్సయ్య, హైదరాబాద్ కు చెందిన ప్రముఖులు పోతురాజు సతీష్, బండ్ల శ్రీనివాస్, వంగల సతీష్, పోచర్ల శ్రీనివాస్, బంగళ సతీష్, కుమార్ యాదవ్ మొదలగు ప్రముఖులు వలదేవతలను దర్శించుకున్నారు. మన దేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సారే సమర్పించి ప్రత్యేక ముక్కలు చెల్లించారు. అనంతరం రూపంలోని అటవీ ప్రాంతంలోని కంక వనంలోకి వెళ్లి వంట కార్యక్రమాలు చేసుకుని, సహా పనికి భోజనాలు నిర్వహించి తిరిగి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన అరుణ్, మునీందర్ కొక్కెర కృష్ణయ్య, కాక సారయ్య, చంద గణేష్, ఎండోమెంట్ సిబ్బంది క్రాంతి, జగదీష్, రఘుపతి, వీరన్న కొప్పుల శ్యామ్, సంపత్, దోబే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love