– విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని సమాధానం చెప్పాలి: బిలియనీర్ జార్జ్ సోరస్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని మోడి సమాధానం చెప్పాలని అమెరికాకు చెందిన బిలియనీర్ జార్జ్ సోరస్ డిమాండ్ చేశారు. ఇటీవల మ్యూనిచ్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో చేశారు. ఇటీవల మ్యూనిచ్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భారత ప్రధానిపై సోరస్ విమర్శలు చేశారు. అదానీ గ్రూపు సంక్షోభాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన సోరస్.. స్టాక్స్ విషయంలో అదానీ మోసాలకు పాల్పడినట్టు హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంట్‌లో మోడీ వివరణ ఇవ్వాలని అన్నారు. అదానీ సంక్షోభం మోడీని బలహీనపరచనున్నట్లు సోరస్ అభిప్రాయపడ్డారు. అదానీ ఘటనతో వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టాల్సి వస్తుందన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం తప్పదన్నారు. భారత్, రష్యా నుంచి చాలా తక్కువ ధరతో చమురు కొనుగోలు చేసి దానిపై చాలా డబ్బు సంపాదిస్తోందని వ్యాఖ్యానించారు. హిండెన్‌బర్గ్ రిపోర్టు ఇచ్చిన తర్వాత జనవరి 24వ తేదీ నుంచి అదానీకి చెందిన ఏడు కంపెనీలు ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లలో బిలియన్లు కోల్పోయాయి.
సోరస్ ఆర్థిక నేరస్తుడు : బీజేపీ
జార్జ్ సోరస్ ఆర్థిక యుద్ధ నేరస్థుడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను మోసం చేసి, ఆ దేశంతో ఆర్థిక యుద్ధ నేరస్థుడిగా పేర్కొనబడిన వ్యక్తి అని అన్నారు. సోరస్ మోడీపైనే కాకుండా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని విమర్శించారు.