‘రఫేల్‌’ ఒప్పందంలో రూ.60 వేల కోట్ల కుంభకోణం

– ఎలాంటి అనుభవంలేని ‘రిలయన్స్‌ డిఫెన్స్‌’కు రూ.30వేల కోట్ల ఆర్డర్‌
– ఈ వ్యవహారంలో సుప్రీంను తప్పుదోవపట్టించిన కేంద్రం : ఎస్వీకే వెబినార్‌లో రచయితలు రవి నాయర్‌, పరంజోయి గుహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో రూ.60 వేల కోట్ల కుంభకోణం జరిగిందనే అనుమానాలు న్నాయని డిఫెన్స్‌ రంగంలో విశేష అనుభవం కలిగిన సీనియర్‌ జర్నలిస్టులు రవి నాయర్‌, పరంజోయి గుహ ఠాకుర్తా అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొనసాగిన పరిణా మాలు ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయని వారు చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి లో భారతదేశ కీర్తిని దిగజార్చేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించిన నేపథ్యం లో ఆ మొత్తం వ్యవహారంపై సమగ్ర సమాచారంతోపాటు రక్షణ శాఖ సీనియర్‌ అధికారుల ఇంటర్వ్యూలను కలిపి సీనియర్‌ జర్నలిస్టులు రవి నాయర్‌, పరంజోయి గుహ ఠాకుర్తా రాసిన ‘రఫేల్‌ డీల్‌ – ఫ్లైయింగ్‌ లైస్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినరు కుమార్‌ సమన్వయంతో బుధవారం నిర్వహించిన వెబినార్‌ వేదికగా ఆ పుస్తకాన్ని పరిచయం చేశారు.ఈ సందర్భంగా రవి నాయర్‌, పరంజోయి గుహ ఠాకుర్తా ఢిల్లీ నుంచి వెబినార్‌లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ నుంచి 126 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ సర్కారు ఉన్నట్టుండి రద్దు చేసుకోవడం అనేక అనుమా నాలకు తావిచ్చిందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దానికి సహేతుక కారణాలను కూడా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చెప్పలేదని రవి నాయర్‌ తెలిపారు. రఫేల్‌ వ్యవహారంలో ఐదేండ్లు శ్రమించి పుస్తకాన్ని తీసుకొచ్చామని వివరించారు. 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించి కేవలం 37 విమానాలే కొనుగోలు చేస్తామని మోడీ ప్రకటించడం రక్షణ రంగ నిపుణులను సైతం అయోమయానికి గురి చేసిందని చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి ఇతర దేశాల నుంచి సామాగ్రిని కొనుగోలుచేసే విషయంలో ఆర్మీ ఉన్నతాధికారులు, నిపుణులతో కేంద్రం విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్నా.. మోడీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. అత్యవసరం అని మోడీ చెప్పే వివరణ సహేతుకంగా లేదన్నారు. ఫ్రాన్స్‌తో రఫేల్‌ ఒప్పందం రద్దు వ్యవహారంపై చర్చ కొనసాగుతున్న సమయంలోనే మోడీ కార్పొరేట్‌ మిత్రులైన అదానీ, అనిల్‌ అంబానీలు ఢిఫెన్స్‌ కంపెనీలను ఏర్పాటు చేశారని పరంజోయి గుహ గుర్తు చేశారు. మోడీ ఫ్రాన్స్‌ పర్యటన లో ఉన్పప్పుడే ఆదేశ అధ్యక్షుడు హోలండ్‌ మాట్లాడుతూ 36 యుద్ధ విమా నాలను మాత్రమే భారత్‌కు ఇస్తున్నామంటూ మీడియాకు చెప్పారని గుర్తుచేశారు. అంతేకాకుండా.. యుద్ధ విమానాల నిర్వహణకు సంబంధించి ఆ రంగంలో ఎలాంటి అనుభవంలేని అంబానీ డిఫెన్స్‌కు రూ.30వేల కోట్ల కాంట్రాక్టు దక్కిందని వివరించారు. అంబానీ డిఫెన్స్‌కు వేల కోట్ల డీల్‌ ఎలా ఇస్తారంటూ ఫ్రాన్స్‌ మీడియా ఆ దేశాధ్యక్షుడిని అడగ్గా.. తమకు మరో గత్యంతరంలేదంటూ ఆయన సమాధానం ఇచ్చారంటూ గుహ గుర్తుచేశారు. రక్షణ రంగ సామాగ్రి కొనుగోలు విషయంలో షరతులను నీరుగార్చే పద్దతిలో జాతీ సెక్యూరిటీ సలహాదారు అజిత్‌ దోవల్‌ వ్యవహరించారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై వాజ్‌పేయి కేబినేట్‌లో మంత్రులుగా పనిచేసిన సీనియర్‌ నాయకులు అరుణ్‌ శౌరి, యశ్వంత్‌ సిన్హా, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌… సీబీఐకి ఫిర్యాదు చేస్తే.. ఆవెంటనే ఆ సంస్థ డైరెక్టర్‌ అలోక్‌ వర్మని తప్పించారని గుర్తుచేశారు. వారు సుప్రీంను ఆశ్రయించినా ఉపయోగంలేకుండా పోయింద న్నారు. సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పారు. అప్పుడు సీజేగా ఉన్న రంజన్‌ గగోరు తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. కాగ్‌, పీఏసీని కూడా కేంద్రం తప్పుదోవపట్టించిందని విమర్శించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలెండ్‌ సన్నిహితురాలు జూలి సినిమాలో అనిల్‌ అంబానీ పెట్టుబడులు పెట్టటం కూడా అప్పట్లో చర్చనీయాంశమయిందని గుహ తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారి రఘునాద్‌ నంబియార్‌ ఇంటర్వ్యూ కూడా తమ పుస్తకంలో ఉందన్నారు. రఫేల్‌కు సంబంధించి భారత రక్షణ శాఖ, వాయుసేన మధ్య జరిగిన ఉత్తర పత్యుత్తరాలన్నీ 560 పేజీల పుస్తకంలో ప్రచురించామని వారు ఈ సందర్భంగా వివరించారు.

Spread the love