– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జనవరి 20 నుంచి 22 వరకు జరగనున్న తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ట్ టైక్వాండో ఛాంపియన్‌ఫిప్ – 2023 నిర్వాహణ పై రూపొం దించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా మైదానాల నిర్మాణాలను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మిస్తున్నా మన్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా ప్రారంభించామని తెలిపారు. గ్రామీణ క్రీడాకారు లను సుమారు 9,500 గ్రామీణ క్రీడా ప్రాంగ ణాలను నిర్మించామన్నారు. వీటి ద్వారా కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్ క్రీడలను ప్రోత్స హిస్తున్నా మన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కామన్వెల్త్లో మెరుగైన ప్రదర్శన చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. బాక్సింగ్ ఛాంపియ న్షిప్లో నిఖత్ జరీన్ ఛాంపి యన్‌గా నిలిచి ఇతర క్రీడాకారులకు స్పూర్తి నిచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను, కోచ్‌లను ప్రోత్సహిస్తున్నామ న్నారు. స్టేట్ ఇంటర్ డిస్టిక్ట్ టైక్వాండో ఛాంపి యన్ఫిప్ – 2023 లో సుమారు వెయ్యి మంది క్రీడా కారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. 38 సబ్ జూనియర్, ఆరు క్యాడేట్, 39 జూనియర్, 308 సీనియర్ విభాగాల పోటీలను నిర్వహి స్తున్నామని నిర్వాహకులు మంత్రికి వివరిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధి కార సంస్థ చైర్మెన్ ఇ. ఆంజనేయ గౌడ్, టైక్వాండో అసోసి యేషన్ అధ్యక్షులు సతీష్ గౌడ్, సెక్రెటరీ ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీహరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.