నరేంద్రమోడీ ఫ్లెక్సీ దగ్ధం..

నవతెలంగాణ-వీణవంక
రాహుల్ గాంధీకి పార్లమెంట్ లో సభ్యత్వం రద్దుపై గుజరాత్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో తో కూడిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సాహెబ్ హుస్సెన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాడి రాజిరెడ్డి, జున్నూతుల మధూకర్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, వీరబోయిన గట్టయ్య, లాలయ్య, బాబురావు, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.

Spread the love