‘రోజులు మారాయి’ సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన చేతన్ మద్దినేని ‘గల్ఫ్’ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే ప్రయోగాత్మక సినిమా ‘బీచ్ రోడ్ చేతన్’ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. ఐఫోన్‌లో చిత్రీకరించిన ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలై శభాష్ అనిపించుకుంది. ఇక ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. నేడు (ఆదివారం) చేతన్ మద్దినేని పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కరోనా కారణంగా రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో లాస్ ఏంజిల్స్‌లో ఉన్న లీస్ట్ ట్రాస్ బర్గ్ ఇన్‌స్టిట్యూట్‌లో మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నాను. అలాగే కథలు వినే క్రమంలో గోపీమోహన్ చెప్పిన ఒక స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాను. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ కథ నచ్చి నేనే సొంతంగా నిర్మిస్తున్నాను. 50 శాతం పూర్తి అయిన ఈ సినిమాను పోలెండ్‌లో షూట్ చేశాం. ‘అల్లరి నరేష్’తో జేమ్స్ బాండ్ సినిమాను డైరెక్ట్ చేసిన సాయి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘రెడీ, ఢ, చిరునవ్వు’తో సినిమాల తరహాలో ఈ మూవీ ఉంటుంది. ఈచిత్రాన్ని దర్శకుడు సాయికిషోర్ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతోపాటు నాకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాం. గోపీసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే మూడు పాటలను చిత్రీకరించాం. హెబ్బా పటేల్ ఈ సినిమా కోసం మంచి మెకోవర్ అయ్యారు. అద్భుతంగా నటించింది. అలాగే మేజర్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. త్వరలో ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా’ అని తెలిపారు.