రైతులు అధికారుల సూచనలు పాటిస్తేనే మేలు

– జిల్లా పరిపాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచన
-మండల కేంద్రంలో వరిపంట పోలం పరిశీలన
-ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని రైతుల విజ్ఞప్తి
– చర్చనీయాంశంగా మారిన ఏఓ గైర్హాజర్
నవతెలంగాణ-బెజ్జంకి
రైతులు పంటలు సాగుచేయడానికి సమాయత్తమవుతున్న సమయంలో వ్యవసాయ శాఖాధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా పరిపాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు పాటించారు.మంత్రి హరీశ్ రావు సూచన మేరకు అదివారం మండల కేంద్రంలో తెగులుసోకి కొలుకున్న వరిపంట పొలాన్ని జిల్లా పరిపాలనాధికారి పరిశీలించారు. వరి వంగాడాలు నాటే సమయంలో తీసుకున్న సస్యరక్షణ చర్యలు, జాగ్రత్తలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వరి నాటే ప్రక్రియలో రైతులు తీసుకున్న అజాగ్రత్తలు, వాతావరణ మార్పుల పరిస్థితి దృష్ట్యా వరిపంటలో తెగుళ్లు ఆశిస్తున్నట్టు తమదృష్టికి వచ్చినట్టు తెలిపారు.మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో వరిపంటలకు మొగిపురుగు తెగుళ్లు సోకడంతో రైతులు అందోళన చెందుతున్నారని.. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ప్రాథమిక విచారణ చేపట్టి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు నివేదిక రూపొందించాలని సూచన మేరకు వరిపంట పోలాలను పరిశీస్తున్నామన్నారు.రైతులు అందోళన చెందవద్దని పరిపాలన పరంగాఅధికార యంత్రాంగం సహయ సహకారాలందించడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.మండల వ్యవసాయాధికారి రైతులను సమన్వయం చేసుకుంటూ వరిపంటకు సోకిన తెగుళ్లపై నివేదిక రుపోందించాలని..నివేదికను మంత్రి హరీశ్ రావు,ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఎంపీపీ నిర్మల, ఎఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ రాజయ్య, లక్ష్మారెడ్డి,దీటీ రాజు,మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి,తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు,జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్, ఏడీఏ మహేష్,శాస్త్రవేత్త విజయ్, ఏఈఓలు రేణుకా శ్రీ, మానస, రచన,ఆత్మాధికారి సాయి చరణ్, రైతులు హజరయ్యారు.
 ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని విజ్ఞప్తి
ప్రకృతి వైపరిత్యాలు,వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు సాగుచేస్తున్న వరిపంటలకు తెగుళ్లు సోకి 50 శాతం నశించిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంటకు సోకిన తెగులుతో తీవ్ర అందోళన చెందుతున్నామని ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిపాలనాధికిరికి రైతులు విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పేర్కొంటామని పాటీల్ తెలిపారు.
 పరిపాలనాధికారా పర్యటనలో ఏఓ గైర్హాజర్
జిల్లా పరిపాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ వరిపంట పొలాల పరిశీలన పర్యటనలో మండల ఏఓ గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.వరిపంట పొలాలకు సోకిన తెగుళ్లపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక రుపోందించాలని పరిపాలనాధికారి  సూచించిన సమయంలో ఏఓ గైర్హాజరీలో ఉండడం శోచనీయం.

Spread the love