రైతు బంధుతో పెద్ద రైతులే బాగు : రేవూరి

నవతెలంగాణ-నర్సంపేట
రైతుల ఆత్మహత్యల్లో మూడు… అప్పుల్లో ఐదు… నెలసరి ఆదాయంలో తెలం గాణ 25వ స్థానం… ఇది ఎనిమిదిన్నర యేండ్ల కేసీఆర్‌ పాలనకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌజ్‌ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్‌ నిరంకుశ పాలనను నిరస్తూ ప్రజా పో రు దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ కేసీఆర్‌ ఎనిమిదిన్నర యేండ్ల పాలనలో ఏ వర్గం బాగు పడిందిలేదని, ఎన్నికల హామీల విస్మరించి రైతు లను, నిరుద్యోగులను నిలువున మోసగించాడని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మోసాల పై బీజేపీ పోలింగ్‌ బూత్‌ అధ్యక్ష, కార్యదర్శులు గడపగడపకు తీసుకెళ్లి ఎండగట్టా లని పిలుపు నిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పనులకు బిల్లులు రావని, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గుర్తించి మోసపోవద్దని సూచించారు. పంట నష్ట పరిహారం వివరాలు గ్రామ పంచాయతీ ఎదుట వెల్లడించాలి. కిందటేడాది అకాల వర్షాలకు నియోజకవర్గంలో 14 వేల ఎకరాల పంట న ష్టం వాటిల్లగా ఇప్పటి వరకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చింది లేదన్నారు. నవం బర్‌ 22న పరిహారం ఇస్తున్నట్లు జివో జారీ అయిందని ఎమ్మెల్యే ప్రకటించాడని ఇప్పటివరకు ఇవ్వక పోవడానికి కారణాలేంటో చెప్పాలన్నారు.గ్రామ పంచాయతీ ల ఎదుట నష్టపోయిన రైతుల జాబితా వెల్లడించాలన్నారు. కరెంట్‌ కోతలు విధు స్తున్నారని రైతులు రాస్తారోకోలు, సబ్‌స్టేషన్‌లను ముట్టడిస్తూ నిరసనలు చెపడు తున్నారని, కరెంటు సరఫరాపై కేంద్రంపై నిందలు మోపి కేసీఆర్‌ తన వైఫల్యాల ను కప్పిపుచ్చుకుంటున్నాడన్నారు. వాస్తవానికి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లు ఎంత ఉత్ప త్తి చేస్తుందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏసీడీ చార్జీలు వసూళ్లు చేయడం ఎంత వరకు సమంజసమని, బస్‌ చార్జీలు పెంచి పేదలపై భా రాన్ని మోపాడన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్‌, బీజేపీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చ రాష్ట్ర ఉపా ధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి రేసు శ్రీనివాస్‌, నెక్కొండ మాజీ ఎంపీపీ గటికె అజరు కుమార్‌, పట్టణాధ్యక్షులు బాల్నే జగన్‌, నాయకులు వడ్డె పెల్లి నర్సింహారాములు,మద్దికాయల రాంబాబు,దుగ్గొండి మండలాధ్యక్షులు చుక్క రమేష్‌, బీజేపీ మహబూబాబాద్‌ పార్లమెంటరీ కోఆర్డీనేటర్‌ జాటోత్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love