నవతెలంగాణ-జూబ్లీహిల్స్
మన రోజువారీ జీవితంలో మనం మన కలలను అన్వేషిస్తూ ముందుకు సాగుతుంటాం. మరింతగా సంపాదించాలనీ, మరింత శక్తివంతం కావాలనీ, మంచి గౌరవ మర్యాదలు పొందాలని తలపోస్తుంటాం. ఈ ప్రక్రి యలో మనం ఎంతో ఒత్తిడి ఎదుర్కోవడంతో పాటు మన ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చేస్తుంటాం. వ్యాయామం చేయకపో వడం, నిద్ర సరిగా పోకపోవడం, విపరీతంగా అనారోగ్యక రమైన స్నాక్స్‌ను తినడం, ఇతర జంక్ ఫుడ్ తీసుకోవడం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు, ఇతర రోగాలు రావడానికి కారణమవుతాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చేయాలి?.
ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు? మనం తీసుకునే ఆహారం మన బరువు, హార్మోన్లు, అవయవాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుం ది. సరైన ఆహారం తీసుకుంటే గుండె ఆరోగ్య సమస్యలు, స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. హౌల్ గ్రెయిన్ ఫుడ్ తీసుకోవడం ఓ అలవాటుగా మార్చుకోవ డంతో పాటు తాజా పండ్ల్లు, కూరగాయలు తీసుకోవాలి. ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. కొద్ది మొత్తంలో కొవ్వు కూడా డైట్లో భాగం చేసుకోవాలి. రైస్ బ్రాన్ ఆయిల్ లాంటి నూనెల వినియోగం మంచిది. వీటిలో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్, గామా ఒరైజనాల్ వంటివి ఉండటం వల్ల మనకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రైస్ బ్రాన్ ఆయిల్ మూలం ఊకను తొలగించిన తర్వాత బియ్యంను పాలిష్ చేస్తున్న సమయంలో పొందే ఉప ఉత్పత్తి బంగారు వర్ణపు పొర రైస్ బ్రాన్. ఈ బ్రాన్ నుంచి తీసిన నూనె రైస్ బ్రాన్ ఆయిల్. వైద్య పరంగా ఈ నూనెలో అత్యంత ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ గామా ఒరైజనాల్ ఉంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) నిష్పత్తిని పెంచడం ద్వారా టోటల్ ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి బ్లడ్ కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో అత్యంత క్రియాశీలకమై న భాగమిది. ఫిజికల్లీ రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్ సాధారణంగా గోల్డెన్ ఎల్లో రంగులో ఉంటుంది. దీన్ని స్టీమ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. దీనివల్ల అత్యవసర పోషకా లన్నీ సంరక్షించబడతాయి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో 10000ం పీపీఎం ఒరైజనాల్ ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను మెరుగుపరుస్తుంది. తద్వారా మీతో పాటు మీ ప్రియమైన వారు కూడా చక్కగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన గుండెను పొందేందుకు ఇది అత్యధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంది. అందువల్ల అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేసినప్పటికీ స్థిరంగా ఉంటుంది. వేపుళ్లకు సైతం ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇవే అంశాలు ప్రతి భారతీయ గృహంలోనూ తప్సనిసరిగా ఉండాల్సిన వంటనూనెగా రైస్ బ్రాన్ ఆయిల్‌ను నిలుపుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, ఆరోగ్యవంత మైన నూనెలుగా పేర్కొనబడుతున్న కొన్ని నూనెలు, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద అస్థిరంగా ఉంటాయి. అందువ ల్ల అవి కేవలం డ్రెస్సింగ్స్కు మాత్రమే పనికొస్తాయి తప్ప భారతీయ గృహాలకు అస్థిరంగా ఉంటాయి. రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈ, కొలెస్ట్రాల్ తగ్గించే సామర్ధ్యాలు సైతం ఉన్నాయి. ఇవి అత్యుత్తమంగా ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్మాయి. అందువల్ల రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్య వంతమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది. ఈ సంద ర్భంగా పి.చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫ్రీడం రైస్ బ్రాన్ ఆయిల్ మాట్లాడుతూ నిపుణులు వెల్లడించే దాని ప్రకారం ఒకవేళ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాలంటే, వారు సరిగా తినాలి, అలాగే చెడు అలవాట్లు అయిన పొగ తాగడం మానేయాలీ, కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీరు తాగాలి అని తెలిపారు.