లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు

లండన్‌ : ఇంగ్లండ్‌ రాజధానిలండన్‌లో ఇంటి అద్దెలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లండన్‌వాసులు జీవన వ్యయంతోపాటు, విద్యుత్‌ ఛార్జీల పెంపుదలతో సతమతమవుతున్నారు. తాజాగా గృహ యజమానులు గతేడాది కంటే ఈ ఏడాది ఇంటి అద్దెలు పెంచడానికి మొగ్గుచూపుతున్నారని టెలిగ్రాఫ్‌ నివేదిక వెల్లడించింది. లండన్‌లో గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ. 2,50,000 ఉన్న ఇంటి అద్దె ఈ ఏడాది ప్రారంభంలో 3,000,00 లక్షలకు పెరిగే అవకాశమున్నట్లు టెలిగ్రాఫ్‌ నివేదిక పేర్కొంది. కాగా, గతేడాది లండన్‌ కాకుండా.. మిగతా దేశాల్లో ఇంటి అద్దెలు 9.7 శాతం పెరిగాయని న్యూస్‌ అవుట్‌లెట్‌ నివేదించింది. ఇక లండన్‌లో 2021 తర్వాత ఇంటి అద్దెలు 9.9 శాతంతో రెండవ అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు న్యూస్‌ అవుట్‌లెట్‌ పేర్కొంది. ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడంతో.. అద్దెదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గృహ యజమానులు అద్దెను పెంచే అభిప్రాయాన్ని మార్చుకోవాలని ప్రాపర్టీ సైన్స్‌ డైరెక్టర్‌ టిమ్‌ బన్నిస్టర్‌ అన్నారు.

Spread the love