లారీని ఢీకొట్టిన ఆటో…ఆరుగురు మృతి


చెన్నై:
తమిళనాడులోని చెంగల్పట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఆటో ఢీకొన్న ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఆటో పూర్తి ధ్వంసమయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులంతా చెన్నై నగరానికి చెందినవారుగా గుర్తించారు. తిరువన్నామళైలో కార్తికై దీప ఉత్సవంలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Spread the love