న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్ల పెంపును ఇక నిలిపివేయనున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. మందగమనం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపునపై వెనక్కి తగ్గనున్నాయని పేర్కొంది. అధిక వ్యయాల నేపథ్యంలో పెట్టుబడులు తగ్గిపోవడంతో వృద్థిపై మరింత ప్రభావం పడనుందని తెలిపింది. ఈ క్రమంలో వడ్డీ రేట్ల పెంపునకు ఇక స్వస్తి చెప్పనున్నాయని ఎస్‌బిఐ అంచనా వేసింది.