వరి పంటపై మోగి పురుగు నివారణ చర్యలు..

నవతెలంగాణ-డిచ్ పల్లి
వరి పంటపై మోగి పురుగు నివారణ చర్యలు చేపట్టు కోవాలి డిచ్ పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి  జి.రాంబాబు సూచించారు.సోమవారం మండలంలోని ధర్మారం బీ గ్రామమంలో వరి పంట పొలాలను క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో కాండం తోలిచే పురుగు ఉదృతంగా ఉన్నట్లు గుర్తించాడం జరిగిందని వివరించారు.
వరిలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు నివారణకు ఎకరాకు కార్టాప్ హైడ్రా క్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు (లేదా) క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4 కిలోల చొప్పున వేసుకోవాలని, వరిలో ఉల్లికోడు నివారణకు ఫిప్రోనీల్ గుళికలు 0.3% 6 10కిలోలు (లేదా) ఫిప్రోనిల్ గుళికలు 0.6% G 4కిలోలు ఇసుకలో కలిపి వేసుకోవాలి మరియు 25 రోజులు పైబడిన పైరులో ఫిప్రోనీల్ 5%SC 2.5 మి.లీ. (లేదా) కార్బోసల్ఫాన్ 25 EC @2.5 మి. లీ.లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు.
వరిలో ఆకుముడత పురుగు నివారణకు కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 50% SP అనే మందును 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని పేర్కొన్నారు. వరిలో రెల్లరాల్చు పురుగు నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి. లీ. ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.ఒకవేళ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి. లీ. ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. కాండం తోలుచు / మొగిపురుగు నివారణకు ఎక్కడ కార్టర్ హడ్రి క్లోరైడ్ 46 గుళికలు 8కిలోలు (లేదా), క్లోరాంట్రానిల్ 0.46 గుళికలు 4 కిలోల చొప్పున వేసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమలో మంచి గోపి, రమేష్ రైతులు పాల్గొన్నారు.

Spread the love