వాణీ జయరాం మృతికి సీఎం సంతాపం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో:
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్‌ వాణీ జయరామ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం సినీ రంగానికి అందించిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. వాణీ జయరాం కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love