వానికి చెప్పు…చెంపడం ఖాయం

–  చెరుకు సుధాకర్‌ కుమారుడికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దమ్మీకి
–  సంచలన ఆడియో వైరల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వాడి(టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌)కి చెప్పు…వారంలో రోజుల్లో చంపడం ఖాయమంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌కు దమ్మీకి ఇచ్చారు. ఆదివారం ఈమేరకు సుహాస్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌ చేసి బెదిరించిన ఆడియో వైరల్‌ అయింది. వాణ్ని చంపేందుకు తన అనుచరులు తిరుగుతున్నారనీ, వారం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమంటూ సుధాకర్‌ కొడుకు సుహాస్‌కు స్వయంగా ఫోన్‌ చేసి హెచ్చరించారు. ‘సుధాకర్‌ను చంపేందుకు వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు. నిన్ను చంపుతారు. నీ హాస్పిటల్‌ను కూలగొడుతారు. నేను లక్షల మందిని బతికించాను. వారందరినీ నేను కంట్రోల్‌ చేయలేను. వాడు (చెరుకు సుధాకర్‌) జైల్లో పడితే నేను ఒక్కడినే పోయాను. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రజల్లో తిరిగినా, నాపై స్టేట్‌మెంట్‌ ఇస్తే ఊరకోం. చంపేయడం ఖాయం’ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటివరకు ఆరోపణలు, విమర్శలు మాత్రమే చేసిన కోమటిరెడ్డి తాజాగా చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడటంతో కాంగ్రెస్‌లో చర్చనీయాంశమవుతున్నది.

Spread the love